Jr NTR, Koratala Siva: ఎన్టీఆర్ తో పాన్ ఇండియా.. 4నెలల్లోనే పూర్తి చేస్తారా?

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో అత్యధికంగా వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చింది ఎన్టీఆర్ అనే చెప్పాలి. అరవింద సమేత సినిమా తరువాత మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించని తారక్ ను చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ తో రామ్ చరణ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానుల్లో అంచనాలను అమాంతంగా పెంచేసింది.

ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ పై కూడా పడింది. ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వీరు ఇప్పుడు మరో భారీ సినిమా చేసేందుకు చేతులు కలిపారు. అయితే ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో అంతకుమించి అనేలా సినిమా చేయాలని కొరటాల శివ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేసిన కొరటాల శివ ఆ సినిమా విడుదల అనంతరం ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు.

కానీ అనుకోకుండా కరోనా కారణంగా ఆ సినిమా వాయిదా పడటం వలన ఆలస్యం అవుతోంది. అయితే ఎన్టీఆర్ తో సినిమాని మొదలు పెడితే కొరటాల శివ నాలుగు నెలల్లోనే పూర్తి చేసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకొనున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలల్లో లేదా ఆరు నెలల్లో సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఆ సమయానికి ప్రభాస్ ఆదిపురుష్ జనవరి 13న రానుంది.

ఇక రామ్ చరణ్ శంకర్ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసింది. ఇక మహేష్ త్రివిక్రమ్ సినిమా జనవరి 6న రావచ్చని అంటున్నారు. మరి ఈ భీకర పోరులో ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్ట్ నిజంగానే పోటీ పడుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు ఇటీవల ఆమెనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus