నార్త్ లో తన సత్తా చాటడానికి తారక్ సిద్ధం..!

మన టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు నార్త్‌లో మంచి క్రేజ్ ఉంది. మన స్టార్ హీరోల హిందీ డబ్బింగ్ వెర్షన్ చిత్రాలకి డబ్బింగ్ రైట్స్ రేట్ ఓ రేంజ్లో పలుకుతుంది. యూట్యూబ్ లో అయితే తెలుగు వెర్షన్ ల కంటే హిందీ వెర్షన్ లకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే మన ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ క్రేజీ హీరో అయిపోయాడు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బీటౌన్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్ట్రెయిట్ గా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అదేంటి ఈ చిత్రంలో కూడా హీరో కదా… మరి ఎన్టీఆర్ పేరే చెప్తున్నారేంటి అని అనుకుంటున్నారా..? అదేమీ లేదండి మన చరణ్ ఇది వరకే ‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు… కానీ ఎన్టీఆర్ కి ఇదే మొదటి సారి. ఇక ఎన్టీఆర్ – చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ బడా మల్టీస్టారర్ చిత్రం తెలుగుతో పాటు, తమిళ , హిందీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతుంది. ‘బాహుబలి’ కి ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ భారీ మల్టీస్టారర్ ద్వారా బాలీవుడ్‌లో ఎన్టీఆర్ పేరు మారు మ్రోగడం ఖాయం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఏ రేంజ్లో వారిని అలరిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus