Jr NTR, Buchi Babu: ఎన్టీఆర్ బుచ్చిబాబు మూవీ కథ మారిందట.. కానీ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాలో నటించాలని తారక్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కథకు సంబంధించి గతంలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. వైరల్ అయిన వార్తల ప్రకారం తారక్ వికలాంగుడిగా, 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారని కామెంట్లు వినిపించాయి.

అయితే తారక్ ను అలా చూపించడం ఆయన అభిమానులలో చాలామందికి నచ్చలేదు. వరుస విజయాలతో జోరుమీదున్న తారక్ కెరీర్ పరంగా రిస్క్ తీసుకోవడం కూడా ఆయన ఫ్యాన్స్ కు నచ్చకపోవడం గమనార్హం. అయితే ఫ్యాన్స్ సూచనల మేరకు బుచ్చిబాబు కథలో కీలక మార్పులు చేశారని తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించడంతో పాటు ఒక పాత్రలో కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. బుచ్చిబాబు తొలి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మించగా ఈ సినిమాను కూడా మైత్రీ నిర్మాతలే నిర్మిస్తుండటం గమనార్హం.

ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాలని మైత్రీ నిర్మాతలు భావిస్తున్నారు. తారక్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం. అయితే తారక్ ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లు పూర్తి కావాలంటే కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. మరి తారక్ కోసం బుచ్చిబాబు మరో రెండేళ్ల పాటు ఎదురుచూస్తారా? లేక కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతారా? చూడాల్సి ఉంది.

బుచ్చిబాబు మరో సినిమాను పూర్తి చేసి తారక్ సినిమాపై దృష్టి పెడితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో తారక్ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus