Jr NTR, Buchi Babu: బుచ్చిబాబు ఆశలపై నీళ్లు చల్లిన ఎన్టీఆర్..!

‘ఉప్పెన’ సినిమా ప్రమోషన్ల టైంలో ఎన్టీఆర్ కి తెగ బిస్కట్లు వేసేశాడు ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి బుచ్చిబాబు అసిస్టెంట్ గా పనిచేశాడు. అదే టైములో ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం పెరిగిందని ఆయనకి రెండు, మూడు కథలు కూడా వినిపించానని.. అందులో ఓ కథ ఎన్టీఆర్ కు నచ్చడంతో ఎక్కడ నుండీ లేపేసావ్ రా అన్నాడని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. ఇక ‘ఉప్పెన’ చిత్రం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత..

బుచ్చిబాబు పై ఎన్టీఆర్ ఫోకస్ పడింది. పిలిచి మరీ బుచ్చిబాబు వద్ద ఉన్న కథల్ని విన్నట్టు.. ఒకటి ఫైనల్ చేసినట్లు టాక్ నడించింది. ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20న బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ బుచ్చిబాబు నిరీక్షణ ఫలించలేదని తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఫోటో షూట్ కూడా జరిగింది.

ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఆ ఫొటోలతోనే డిజైన్ చేసిన పోస్టర్లతో అధికారిక ప్రకటన, టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండొచ్చని అంటున్నారు. అది ఎన్టీఆర్ కు 30వ సినిమా అవుతుంది. ఇక 31 వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయడానికి ఎన్టీఆర్ ఓకె చెప్పేశాడు. ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ ఫలితం చూసాక ప్రశాంత్ నీల్ అయితేనే ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టగలడు అని ఎన్టీఆర్ నమ్ముతున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు. అయితే బుచ్చిబాబు సంగతేంటి? అనేది ప్రశ్నర్ధకంగా మారింది. ప్రస్తుతం హీరోలెవ్వరూ ఖాళీ లేరు. స్టార్ హీరోని తన స్క్రిప్ట్ తో ఇంప్రెస్ చేస్తేనే తప్ప వర్కౌట్ అవ్వదు. ఇలాంటి టైంలో బుచ్చిబాబుకి మిడ్ రేంజ్ హీరోలే దిక్కని చెప్పాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus