Jr NTR, Buchibabu: బుచ్చిబాబు అలాంటి కథను సిద్ధం చేశారా?

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే బుచ్చిబాబు ప్రశంసలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను తన డైరెక్షన్ స్కిల్స్ తో ఆకట్టుకున్నారు. సుకుమార్ కు తగిన శిష్యుడు బుచ్చిబాబు అని ప్రూవ్ చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సినిమా పెద్ద సినిమాల స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా సక్సెస్ వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి కెరీర్ కు ప్లస్ అయింది. ఉప్పెన సక్సెస్ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించాలని చాలామంది ఆసక్తి చూపారు.

అయితే తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ కు ఎన్టీఆర్ కు సరిపోతారని భావించిన బుచ్చిబాబు ఎన్టీఆర్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ సమయంలో ఉన్న పరిచయం వల్ల బుచ్చిబాబు ఎన్టీఆర్ ను కలిసి సులభంగా కథ చెప్పగలిగారు. ఎన్టీఆర్ కు కూడా కథ ఎంతగానో నచ్చిందని సమాచారం. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక కానుందని దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందిస్తున్నారని తెలుస్తోంది.

విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబో మూవీ తెరకెక్కనుందని కొత్త తరహా కథాంశంతో బుచ్చిబాబు ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. క్రీడలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా తారక్ కొత్త లుక్ లో ఈ సినిమాలో కనిపించనున్నారని బోగట్టా. ఒకవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటిస్తూనే మరోవైపు బుచ్చిబాబు సినిమాలో తారక్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఈ సినిమా స్క్రిప్ట్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బుచ్చిబాబుకు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus