Jr New Car: ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎన్టీఆర్ ఎంత ఖర్చు పెట్టారంటే..?

ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లకు కార్లు, బైక్స్ అంటే పిచ్చి. తమ దగ్గర కలెక్షన్ ఉండాలని ఆరాటపడుతుంటారు. మార్కెట్ లోకి కొత్త వెహికల్ వచ్చిందంటే చాలు.. వెంటనే కొనేస్తుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా కార్లంటే చాలా ఇష్టం. ఈ మధ్యనే కోట్లు పెట్టి మరీ లంబోర్ఘిని ఊరుస్ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నాడు. కారు కోసం కోట్లు పెట్టిన తారక్ ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు పెట్టాడు.

తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లను వేలం వేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రూ.17 లక్షలు పెట్టి TS 09 FS 9999 అనే నెంబర్ ను దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యెస్ట్ బిడ్ అని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా తారక్ పది లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈసారి ఏకంగా రూ.17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకొని తన రికార్డును తనే బద్దలు కొట్టడం విశేషం.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ దగ్గరున్న కార్లకు అన్నింటికీ 9999 నెంబర్ ఉంటుంది. కొత్తగా ఏ కారు తీసుకున్నా.. కూడా దానికి కూడా అదే నెంబర్ వచ్చేలా చూసుకుంటాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన తాత, తండ్రి 9999 కారు నెంబర్ వాడారని.. తను కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నానని చెప్పారు.

1

2

3

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus