Jr NTR: కొడుకు ఆన్సర్ విని షాకైన తారక్.. పార్టీ మార్చేశాడంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న తారక్ త్వరలో వార్2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతుండగా తారక్ వేగంగా షూటింగ్ లను పూర్తి చేసి ఈ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ పెద్ద కొడుకు అభయ్ రామ్ ను నాన్న కోసం పుట్టావా? అమ్మకోసం పుట్టావా? అని అడిగితే నాన్న కోసం అని చెప్పేవాడని తారక్ పేర్కొన్నారు.

అయితే నేను షూటింగ్ లతో బిజీ అయ్యి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సెట్స్ లో ఉండేవాడినని నా కొడుకు స్కూల్ కు వెళుతుండటంతో ఉదయం నేను ఇంటికి వెళ్లే సమయానికి లేవట్లేదని రాత్రి ఇంటికి వెళ్లే సమయానికి పడుకుండిపోతున్నాడని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఒకరోజు అభయ్ నాన్న అంటూ నా దగ్గరకు వచ్చాడని ఆ సమయంలో నాన్న అంటే ఇష్టమా? అమ్మ అంటే ఇష్టమా? అని అడగగా అభయ్ రామ్ అప్పుడు అమ్మ అన్నాడని ఇది మనకు తెలియకుండా ఎలా జరిగింది అని అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

నేను వెళ్లిపోయిన తర్వాత మా ఆవిడ, మా అబ్బాయి ఎక్కువ సమయం ఒకే దగ్గర ఉండటంతో కొడుకు అమ్మంటే ఇష్టం అన్నాడని తారక్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. కొడుకు చేసిన పనికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అవాక్కయ్యారు. అదే సమయంలో నాకు మా తాతగారు ఇన్స్పిరేషన్ అని తారక్ కామెంట్లు చేశారు. దేవర సినిమా షూటింగ్ 40 శాతం పూర్తైందని ఈ ఏడాది చివరినాటికి మొత్తం షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే వరుసగా యాడ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తారక్ కు యాడ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags