Jr NTR: ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నానంటున్న తారక్!

బాలనటుడిగా బాల రామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. తొలి సినిమాకు 4 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు 45 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ తన గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Click Here To Watch Now

తనను మొహమాటం లేకుండా ఓపెన్ గా విమర్శించే వ్యక్తులు ఇద్దరు మాత్రమేనని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అందులో ఒకరు నాన్న హరికృష్ణ గారు కాగా మరొకరు రాజమౌళి అని తారక్ వెల్లడించారు. రాజమౌళి వల్లే తాను ప్రస్తుతం నటుడిగా ఈ స్థాయిలో ఉన్నానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో మొత్తం నాలుగు సినిమాలు తెరకెక్కాయి. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఈ కాంబినేషన్ లో తెరకెక్కాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా మినహా మిగిలిన మూడు సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి. దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్, జక్కన్న కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేయగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ మొదలుకావాల్సి ఉంది.

ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. చరణ్, తారక్ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. 336 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus