Jr NTR, Mahesh Babu: తారక్ జోస్యం మహేష్ విషయంలో నిజం కానుందా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి గత సినిమా బాహుబలి2 2017 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన ఐదేళ్ల తర్వాత ఆర్ఆర్ఆర్ కూడా 2022 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఒక్క సినిమాకు ఐదేళ్ల పాటు పరిమితమైతే ఆయన భవిష్యత్తులో కూడా ఐదు సినిమాల కంటే ఎక్కువ సినిమాలు తెరకెక్కించడం సులువు కాదు. ఆర్ఆర్ఆర్ నాలుగుసార్లు వాయిదా పడటంతో మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కూడా 2025 సంవత్సరంలో లేదా 2026 సంవత్సరంలో రిలీజవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ పూర్తి కావడానికి ఈ ఏడాది డిసెంబర్ వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జక్కన్న మహేష్ బాబు మూవీకి తుది మెరుగులు దిద్ది ఆ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తై 2025 సెకండాఫ్ లో లేదా 2026 ఫస్ట్ హాఫ్ లో రిలీజవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ మహేష్ రాజమౌళి మూవీ 2026లో విడుదలవుతుందని కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ జోస్యం నిజమయ్యేలా ఉందని మహేష్ అభిమానులు కూడా ఫీలవుతున్నారు. అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటిస్తూనే మరో సినిమాలో కూడా నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫ్యాన్స్ సూచనలను మహేష్ బాబు పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మహేష్ రెండు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపినా రాజమౌళి అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.

మహేష్ రాజమౌళి మూవీకి కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus