Jr NTR: నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు శుభాకాంక్షలు చెప్పిన తారక్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ వరుస విజయాలను అందుకుంటూ దేవర (Devara)  సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. కేంద్రం తాజాగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించగా జాతీయ అవార్డులు అందుకున్న వాళ్లకు తారక్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తికేయ2 (Karthikeya 2) సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును గెలుచుకోవడంతో తారక్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) , దర్శకుడు చందూ మొండేటిని (Chandoo Mondeti) అభినందించారు.

Jr NTR

దేశవ్యాప్తంగా జాతీయ అవార్డ్ గ్రహీతలందరికీ మంచి గుర్తింపు లభించినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ కన్నడ సినిమాగా జాతీయ అవార్డ్ గెలుచుకున్నందుకు యశ్ (Yash) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel), కేజీఎఫ్2 (KGF 2) బృందానికి అభినందనలు అని తారక్ చెప్పుకొచ్చారు. కాంతార సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డ్ ను సొంతం చేసుకున్నందుకు రిషబ్ శెట్టికి (Rishab Shetty) అభినందనలు అని కాంతార2 సినిమాలో రిషబ్ శెట్టి అభినయం ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ ఇస్తోందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డ్ ను సొంతం చేసుకున్నందుకు కాంతార టీంకు అభినందనలు అని తారక్ పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కు సరిగ్గా రోజుల సమయం మాత్రమే ఉంది. దేవర సినిమా ట్రైలర్ సెప్టెంబర్ నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దేవర సినిమా నుంచి తాజాగా భైరా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

సైఫ్ అలీ ఖాన్  (Saif Ali Khan) విలన్ రోల్ లో అదరగొట్టారని సైఫ్ లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లైనప్ కూడా బాగుందని యంగ్ టైగర్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేరుపేరునా ప్రస్తావిస్తూ తారక్ జాతీయ అవార్డ్ విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus