Jr NTR: ఆ విమర్శలకు చెక్ పెట్టనున్న యంగ్ టైగర్!

ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వాయిదా పడటంతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారని గత రెండు రోజులుగా సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఎన్టీఆర్ కేవలం ఆర్ఆర్ఆర్ మూవీకే పరిమితం కావడంతో రెమ్యునరేషన్ విషయంలో కూడా నష్టపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలకు చెక్ పెట్టే దిశగా తారక్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించే విధంగా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని బోగట్టా.

ఎన్టిఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా 31వ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సి ఉంది. అయితే తారక్ మాత్రం కొరటాల శివ సినిమాతో పాటు బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బుచ్చిబాబు సాన ఎన్టీఆర్ కు కథ చెప్పి ఆ కథను ఓకే చేయించుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుచ్చిబాబు సాన బౌండెడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని బోగట్టా.

అయితే ఒకే సమయంలో ఎన్టీఆర్ రెండు సినిమాలలో నటిస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకే సమయంలో తారక్ రెండు సినిమాలలో నటిస్తే మాత్రం ఫ్యాన్స్ చాలా సంతోషిస్తారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సైతం సిద్ధపడుతున్నారు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు తారక్ మరో సినిమాను విడుదల చేయడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కెరీర్ విషయంలో తారక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆచార్య సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus