Jr NTR: కరోనా విజృంభిస్తున్నా తారక్ కు భయం లేదా..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేసి తారక్ తన హోస్టింగ్ తో ఫ్యాన్స్ ను మెప్పించిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదు కావడానికి కొన్నిరోజుల ముందే ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం కానున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ షోకు సంబంధించి అడిషన్స్ పూర్తి కాగా కరోనా కేసులు తగ్గితే ఈ షోను నిర్వహిద్దామని షో నిర్వాహకులు భావిస్తున్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం షో నిర్వాహకులకు ఓకే అయితే ఇప్పుడే కరోనా జాగ్రత్తలు తీసుకుని షోను నిర్వహిద్దామని చెప్పారని సమాచారం. ఛానెల్ నిర్వాహకులు మాత్రం రిస్క్ ఎందుకని పోస్ట్ పోన్ కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పలు సీరియళ్లు, రియాలిటీ షోల షూటింగ్ లు జరుగుతుండగా కరోనా కేసులు తగ్గకపోతే మాత్రం వచ్చే నెలలో ఈ షోను ప్రారంభించాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ 80 శాతం పూర్తైందని 20 శాతం షూటింగ్ మాత్రం మిగిలి ఉందని సమాచారం. రాజమౌళి జూన్ నెలాఖరు నాటికి షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ ను పూర్తి చేయడం తేలికైన పని కాదు. రాజమౌళి చెప్పిన డేట్ కే ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్ హోస్టింగ్ కు సిద్ధంగా ఉన్నాడనే విషయం తెలిసి కరోనా విజృంభిస్తున్నా తారక్ కు భయం లేదా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus