‘బాహుబలి’ తీసిన రాజమౌళి అంతకు మించిన ప్రాజెక్టుగా ‘ఆర్.ఆర్.ఆర్’ ను సెట్ చేసుకున్నాడు. దీనికోసం ఎన్టీఆర్, రాంచరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలను ఎంపిక చేసుకున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలతో ఈ జెనెరేషన్లో మల్టీస్టారర్ తీస్తుంది రాజమౌళి మాత్రమే. ఇప్పటివరకు వచ్చిన మల్టీస్టారర్లు అన్నీ స్టార్ హీరో- సీనియర్ హీరో లేదా సీనియర్ హీరో- యంగ్ హీరో అన్నట్టు వచ్చాయి. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ అనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ విషయంలో రాజమౌళి ఇద్దరు హీరోలని అలాగే ఇద్దరి స్టార్ ఇమేజ్ ను ఎలా మేనేజ్ చేసాడు అనే విషయం పై అయితే మార్చి 25నే క్లారిటీ వస్తుంది.
ఇద్దరు హీరోలకి సమన ప్రాధాన్యత లేకపోతే వీళ్ళ ఫ్యాన్స్ మధ్య పెద్ద వాగ్వివాదాలు ఏర్పడడం ఖాయం. ఇది పక్కన పెడితే.. చరణ్ కంటే ఎన్టీఆర్ మంచి పెర్ఫార్మర్, ఎన్టీఆర్ కంటే చరణ్ కు మాస్ ఇమేజ్ బాగా ఎక్కువ.. ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో మాత్రం చరణ్ పై ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువగానే కనిపిస్తుంది. సహజంగానే రాజమౌళితో సినిమా చేస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు.
ఇప్పుడు ఏకంగా మల్టీస్టారర్ చేస్తున్నాడు కాబట్టి.. ఈసారి తన కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్ పడుతుంది అనే ఆనందం అతని మాటల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘సింహాద్రి’ తర్వాత ఎన్టీఆర్ సినిమా భారీ లాభాలను అందించినవి అంటూ పెద్దగా ఏమీ లేవు. ‘యమదొంగ’ ‘జనతా గ్యారేజ్’ కొంతవరకు లాభాలను అందించాయి. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కు ఎటువంటి డౌట్ లు, భయాలు లేవు అని ప్రతీ ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. తెగ అల్లరి చేస్తున్నాడు,రెట్టింపు జోష్ తో ప్రతీ ప్రశ్నకి ముఖ్యంగా తనది కానీ ప్రశ్నలకి కూడా కల్పించుకుని మరీ సమాధానాలు చెబుతున్నాడు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!