సరికొత్త రికార్డు సృష్టించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్…!

సోషల్ మీడియాలో ఈ మధ్యన కొన్ని ట్యాగ్ లతో ట్రెండ్ చేస్తూ అభిమానులు కూడా రికార్డు సృష్టిస్తున్నారు. సినిమాల ద్వారా రికార్డు కలెక్షన్లు రాబట్టడం స్టార్ హీరోల వంతు అయితే.. ఇలా సోషల్ మీడియాలో ట్యాగ్ లతో ట్రెండ్ చేసి రికార్డులు సృష్టించడం హీరోల అభిమానుల వంతు అన్న మాట. ఇప్పుడు లాక్ డౌన్ ఉండడంతో అభిమానులు సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. దీంతో తమ అభిమాన హీరోల సినిమాల యానివర్సరి ట్రెండ్ ట్యాగ్ లతోను అలాగే బర్త్ డే ట్రెండ్ ట్యాగ్ లతో… రికార్డ్స్ సృష్టిస్తున్నారు. మొన్నటికి మొన్న ‘డార్లింగ్’ 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే ‘పోకిరి’ చిత్రం 14 ఏళ్ళు పూర్తయ్యింది అని మహేష్ ఫ్యాన్స్ రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతు వచ్చింది.

స్టార్ హీరోల అడ్వాన్స్ బర్త్ డే ట్యాగ్ ట్రెండ్ తో అందరి హీరోల కంటే ఎక్కువ ట్వీట్లు వేసి రికార్డు సృష్టించారు. ఏకంగా 3 రెట్లు కంటే ఎక్కువ ట్వీట్లు వేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకూ రికార్డులు సృష్టించిన ట్యాగ్ లను ఓ సారి గమనిస్తే :

1. #NTRBdayFestBegins – 8.45Mil***

2. #JANASENANIBdayCelebrationsIn15D – 2.4Mil


3. NTR Fans (100 Days-2019) – 2M


4. Prabhas Fans (50 Days) – 1.7 M


5. PK Fans (50 Days) – 1.4 M

ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ 3 రెట్లు ఎక్కువ ట్వీట్లు వేసి… అంటే 8.45 మిలియన్ ట్వీట్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసారు. ఇక మే 20 దాటిన తరువాత జూలై 9 వరకూ ఈ రికార్డు ఎన్టీఆర్ పేరు మీదే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే కాబట్టి.. ఆ ముందు నెల వరకూ ఈ రికార్డు భద్రంగానే ఉండే అవకాశం ఉంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus