Jr NTR: యంగ్ టైగర్ ఫ్యాన్స్ వార్నింగ్ పై వార్2 మేకర్స్ రియాక్ట్ అవుతారా?

వార్2 సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నట్టు అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ ఏడాది చివరినాటికి దేవర సినిమాను పూర్తి చేసి వార్2 సినిమా షూటింగ్ లో పాల్గొనాలని తారక్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నిడివికి సంబంధించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే హృతిక్ కు సమానంగా తారక్ రోల్ ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

పాత్ర విషయంలో తారక్ కు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోమని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే తారక్ రోల్ గురించి స్పష్టత రావాలంటే మాత్రం ఈ చిత్ర దర్శకుడు అయిన అయాన్ ముఖర్జీ స్పందించాల్సి ఉంటుంది. తారక్ రోల్ గురించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న తారక్ కు గెస్ట్ రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. పాత్ర మరీ అద్భుతంగా లేకపోతే తారక్ సైతం వార్2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండడు.

గత కొన్నేళ్లుగా తారక్ కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభిమానులు తల ఎత్తుకునే సినిమాలు తీస్తానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాలలో నటించాలని ఫిక్స్ కావడంతో పాటు ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ వార్2 సినిమాకు భారీ రేంజ్ లో తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వార్2 మేకర్స్ నుంచి సైతం ఎన్టీఆర్ రోల్ గురించి స్పష్టత వస్తే బాగుంటుందని చెప్పవచ్చు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus