యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 23 ఏళ్ల సినీ కెరీర్ లో 29 సినిమాలలో నటించి మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు. తారక్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాపైనా ఆ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. ఆంధ్రావాలా మూవీ డిజాస్టర్ అయినా ఆ సినిమా వల్ల నష్టాలు రాలేదని ఆ సినిమా బిజినెస్ సంతృప్తి కలిగించిందని ఆ సినిమా నిర్మాత ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలను సైతం అద్భుతంగా పోషించగలరు.
అయితే బాల నటుడిగా బాల రామాయణం సినిమాలో పౌరాణిక పాత్రలో మెప్పించిన తారక్ తర్వాత రోజుల్లో మాస్ హీరోగా ఎక్కువ సినిమాలలో నటించారు. 20 ఏళ్ల వయస్సులోనే మాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న తారక్ రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఇతర భాషల ప్రేక్షకులకు దగ్గరైన తారక్ దేవర సినిమాతో సోలో హీరోగా ఫ్యాన్స్ కు మరింత దగ్గరవ్వాలని మార్కెట్ ను మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు.
ఒకింత రిస్కీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా మేకర్స్ కంటెంట్ ను నమ్మి ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో తారక్ పౌరాణిక పాత్రలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం కెరీర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.
షూటింగ్ లకు సంబంధించి గ్యాప్ రాకుండా (Jr NTR) తారక్ జాగ్రత్త పడుతున్నారు. వార్2 సినిమాకు తారక్ డేట్లు కేటాయించారని జనవరి నెల నుంచి షూట్ లో పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ స్థాయి మరింత పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.