Jr NTR: సినిమాల విషయం తారక్ రూట్ కరెక్టే.. కానీ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ భవిష్యత్తు ప్రాజెక్టులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో, దర్శకుల ఎంపిక విషయంలో తారక్ సరైన దారిలోనే వెళుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తారక్ పేరు మారుమ్రోగడంతో పాటు తారక్ ఖాతాలో కొత్త రికార్డులు చేరతాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భిన్నమైన కథాంశాలతో వేర్వేరు జానర్స్ లో తెరకెక్కుతున్నాయి. అదే సమయంలో ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సినిమాలలో తారక్ డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఆ పాత్రలు గతంలో తారక్ పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలు నటుడిగా తారక్ రేంజ్ ను మరింత పెంచడం గ్యారంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమాల విషయంలో తారక్ రూట్ కరెక్టే కానీ అదే సమయంలో సరైన పాత్రలను ఎంచుకోవడంపై తారక్ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తారక్ ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే తారక్ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. తారక్ ప్రస్తుతం రెమ్యునరేషన్ కంటే మంచి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరో మూడేళ్ల పాటు తారక్ ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశాలు అయితే లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సినిమాసినిమాకు తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తారక్ సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. తారక్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు ఫ్యామిలీకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus