దర్శకుడిగా మారకుముందు కొరటాల శివ రచయిత అనే విషయం తెలిసిందే. అయితే దర్శకుడు అయ్యాక తన సొంత కథల్ని కాకుండా వేరే కథల్నే తీస్తున్నారు అని ఓ అపవాదు ఉంది. అయితే తనకు కథల విషయంలో మంచి జడ్జిమెంట్ ఉందని అని అతని గత చిత్రాల ఫలితాలు చెబుతుంటాయి. అయితే ఇప్పుడు అదే జడ్జిమెంటే అతని తర్వాతి సినిమాను ఆలస్యం చేస్తోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇదంతా ఎన్టీఆర్ సినిమా గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తారక్ – కొరటాల శివ కాంబినేషన్‌లో చాలా రోజుల క్రితమే సినిమా అనౌన్స్ అయ్యింది. ‘ఆచార్య’ రిలీజ్ అయ్యాక సినిమా షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకున్నారు కూడా. ‘ఆచార్య’ తొలి విడత ప్రమోషన్స్‌లో ఈ విషయం చెప్పారు. రెండో విడత ప్రమోషన్స్‌లో కూడా ఈ విషయం చెప్పారు. జూన్‌లో చిత్రీకరణ మొదలవుతుందని, ఎన్టీఆర్ ఇంటికి దగ్గర్లోనే సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారని కూడా చెప్పారు. అయితే జూన్ వెళ్లిపోయింద, జులైలో సగం రోజులు గడిచిపోవడానికి మూడు రోజులే ఉంది. కానీ సినిమా మొదలవ్వలేదు.
తాజా సమాచారం ప్రకారం అయితే సినిమా స్టార్టింగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకో రెండు నెలల వరకు ఆగాల్సి ఉంటుందని చెబుతున్నారు. దానికి కారణం ఇంకా కథ విషయంలో ఫైనల్ కాకపోవడమే అంటున్నారు. ‘ఆచార్య’ ఫలితంలో ఆలోచనలో పడ్డ కొరటాల – తారక్ గతంలో అనుకున్న స్టూడెంట్ రాజకీయాల కాన్సెప్ట్‌కు ఇంకొన్ని మెరుగులు అద్ది.. సినిమా పట్టాలెక్కిద్దాం అనుకున్నారట. కానీ పూర్తి స్థాయి మేకోవర్ కావాలని నిర్ణయించారట.
దీంతో కొరటాల టీమ్ మరోసారి కూర్చుని కథతో కుస్తీ పడుతున్నారట. త్వరలో దీనిపై ఓ క్లారిటీ వచ్చాక అప్పుడు సినిమాను స్టార్ట్ చేస్తారు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఆగస్టు ఆఖరులో కానీ, సెప్టెంబరులో కానీ సినిమా మొదలవుతుంది. అయితే ఇప్పటికే సెట్స్ వేసేశారు అని చెప్పారు. ఈ వర్షాలకు ఆ సెట్స్ అలానే ఉన్నాయో, మరి దెబ్బ తిన్నాయో తెలియదు. ఒకవేళ దెబ్బతినుంటే నిర్మాత లాస్ తప్పదు. అన్నట్లు ఈ సినిమా మొదలయ్యేలోపు ఎన్టీఆర్ మేకోవర్ కూడా పూర్తవుతుంది అని చెబుతున్నారు. దీని కోసం తారక్ సుమారు పది కిలోల బరువు తగ్గుతున్నారట.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!