Jr NTR: యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఓపెన్ లెటర్.. కానీ?

కొన్నేళ్ల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తారక్ సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇతర పార్టీలకు మాత్రం ఎన్టీఆర్ మద్దతు ఇవ్వడం, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడటం చేయలేదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓపెన్ లెటర్ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న లేఖలో గడిచిన రెండు సంవత్సరాలుగా అన్న జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా, ఫ్లెక్సీలు కట్టకుండా అభిమానులపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి కుప్పం మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడని అభిమానులు పేర్కొన్నారు. నారా లోకేష్ అన్న జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా అభిమానులపై రెండుసార్లు దాడులు చేయించాడని అభిమానులు లేఖలో చెప్పుకొచ్చారు. గాయపడ్డ ప్రతి ఎన్టీఆర్ అభిమానికి ప్రస్తుతం సమయం వచ్చిందని లోకేష్ పర్యటించిన వార్డుల అభ్యర్థులను ఓడించి ప్రతీకారం రుచి చూపించాలని అభిమానులు లేఖలో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్ దెబ్బ తినేవాడు కాదని అవసరమైతే దెబ్బ కొట్టగలడని చూపిద్దామని ఎన్టీఆర్ అభిమానులు లేఖలో చెప్పుకొచ్చారు. అయితే ఈ లేఖ గురించి ఎన్టీఆర్ కు తెలుసా? తెలియదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంటికే పరిమితం కాగా త్వరలో తారక్ ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus