Jr NTR: నెల ముందే సంబరాలు మొదలుపెట్టిన తారక్ ఫ్యాన్స్.. అభిషేకం చేస్తూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజుకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మే నెల 20వ తేదీన తారక్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనుండగా ఆరోజు తారక్ నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో నెల రోజుల ముందే తారక్ పుట్టినరోజుకు సంబంధించిన సంబరాలు మొదలయ్యాయి. “అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే మాస్ అమ్మ మొగుడు” అంటూ ఎన్టీఆర్ కటౌట్ పై రాసి ఆ కటౌట్ కు తారక్ ఫ్యాన్స్ పాలాభిషేకం చేశారు.

తారక్ కటౌట్ ముందు డ్యాన్స్ లు వేస్తూ అభిమానులు నెలరోజుల ముందే తారక్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడే ఇలా సెలబ్రేట్ చేసుకుంటే తారక్ పుట్టినరోజున ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. దేవర (Devara) సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తో పాటు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇతర సినిమాల అప్ డేట్స్ కూడా రానున్నాయని సమాచారం అందుతోంది.

మాస్ ఫ్యాన్స్ లో మైండ్ బ్లాంక్ అయ్యే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎన్నో రెట్లు పెరిగే దిశగా అడుగులు వేస్తున్నారు. దేవర సినిమా థియేట్రికల్ రైట్స్ 220 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది. దేవర నాన్ థియేట్రికల్ రైట్స్ 150 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. దేవర సినిమా బడ్జెట్, బిజినెస్ విషయంలో మేకర్స్ సంతోషంగానే ఉన్నట్టు సమాచారం అందుతోంది.

ఇకపై ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తారక్ సినిమాలను అదే విధంగా రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. వరుస సినిమాలలో నటిస్తుండటం తారక్ కెరీర్ కు మేలు చేస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం మరింత సక్సెస్ సాధించాల్సి ఉంది.

https://twitter.com/Hemanth_10_/status/1782065131830300861

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus