Jr NTR: అనిరుధ్ ఆ పొరపాటును సరిదిద్దుకుంటారా?

  • April 14, 2022 / 01:46 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారని అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు. అయితే అనిరుధ్ ట్రాక్ రికార్డ్ తెలిసిన వాళ్లు మాత్రం ఎన్టీఆర్ కొరటాల శివ మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక విషయంలో తప్పు చేశారని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అనిరుధ్ మ్యూజిక్ అందించిన బీస్ట్ సినిమా తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

బీస్ట్ సినిమాలో పాటలు బాగానే ఉన్నా బీజీఎం మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. అనిరుధ్ తెలుగులో మ్యూజిక్ అందించిన సినిమాలలో జెర్సీ మినహా మరే సినిమా హిట్ కాలేదు. జెర్సీ సినిమా కూడా నిర్మాతలకు పెద్దగా లాభాలను అందించలేదనే సంగతి తెలిసిందే. పవన్ త్రివిక్రమ్ కాంబో మూవీ అయిన అజ్ఞాతవాసి సినిమాకు మ్యూజిక్ మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. మరోవైపు అనిరుధ్ పాటలు మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండవని ఇండస్ట్రీలో ఒక విమర్శ ఉంది.

ఎన్టీఆర్ కొరటాల మూవీతో అనిరుధ్ ఈ పొరపాట్లను సరిదిద్దుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ మూవీ విషయంలో విమర్శలు వ్యక్తమైతే మాత్రం అనిరుధ్ కు టాలీవుడ్ హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉండవు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి మొదలుకానుంది. వేగంగానే ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సోలో హీరోగా తారక్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ ఈ సినిమాతో కూడా సక్సెస్ అందిస్తారని ప్రేక్షకులు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus