Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కల ఇన్నేళ్లకు నెరవేరిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రలో అద్భుతంగా నటించి తారక్ ప్రశంసలు పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా తారక్ మాత్రం నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. పెద్దల నుంచి పిల్లల వరకు అందరి మనస్సులు దోచుకున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. బిగ్ బాస్ షో సీజన్1, ఎవరు మీలో కోటీశ్వరులు షోల ద్వారా తారక్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

Click Here To Watch NOW

అయితే కెరీర్ తొలినాళ్లలోనే ఆది, సింహాద్రి సినిమాలతో విజయాలను అందుకున్న తారక్ వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంలో ఫెయిలయ్యారు. ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడని ఫ్యాన్స్ ఆనందించే లోపు తర్వాత సినిమా ఫ్లాప్ కావడం వల్ల ఫ్యాన్స్ నిరాశ చెందేవారు. తారక్ నటించిన ఊసరవెల్లి, రామయ్యా వస్తావయ్యా సినిమాల ఫస్టాఫ్ బాగున్నా సెకండాఫ్ లో కథనంలోని లోపాల వల్ల ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

అయితే వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తారక్ టెంపర్ సినిమా నుంచి దర్శకుడి ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఫలితంగా తారక్ వరుసగా 6 విజయాలను అందుకున్నారు. ఈ ఆరు సినిమాలకు వేర్వేరు దర్శకులు పని చేయడం గమనార్హం. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు.

తారక్ నటించిన సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. తారక్ భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా విజయాలను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కొరటాల శివ, బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వేర్వేరు కారణాల వల్ల ఆలస్యం కానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus