Jr NTR: ఆ బాలీవుడ్ డైరెక్టర్లు కావాలంటున్న తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపు దక్కింది. నాటు నాటు సాంగ్ కు ఎన్టీఆర్ అదిరిపోయేలా వేసిన స్టెప్పులు, ఇంటర్వెల్ ఫైట్ సీన్, కొమురం భీముడో సాంగ్ వల్ల తారక్ పేరు మారుమ్రోగుతోంది. చరణ్, తారక్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ లో అద్భుతంగా నటించారు. తారక్ భవిష్యత్తు ప్రాజెక్టులలో కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటనలు వెలువడ్డాయి.

Click Here To Watch NOW

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే తారక్ మాత్రం బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తారక్ తనకు ఇష్టమైన బాలీవుడ్ డైరెక్టర్ల గురించి క్లారిటీ ఇచ్చారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో నటించడానికి తనకు ఆసక్తిగా ఉందని తారక్ వెల్లడించారు. రాజ్ కుమార్ హిరానీ ఎమోషన్స్ ను చాలా సరదాగా చూపిస్తారని సినిమాను రియలిస్టిక్ గా తెరకెక్కిస్తారని తారక్ చెప్పుకొచ్చారు. రాజ్ కుమార్ హిరానీ అలా సినిమాను తెరకెక్కించడం తనకు ఎంతగానో నచ్చిందని తారక్ కామెంట్లు చేశారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను చూస్తానని తారక్ అన్నారు.

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించే భారీ బడ్జెట్ సినిమాలు అంటే తనకు ఇష్టమని తారక్ వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు డైరెక్టర్లు ఇష్టమని తారక్ చెప్పేశారు. తారక్ సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో సినిమా గురించి గతంలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. మరి భవిష్యత్తులో బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడుతాయేమో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus