Jr NTR: ఇన్నేళ్ళలో ఎప్పుడూ లేనంత కోపం.. తారకరత్న కోసమేనా?

నిన్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. అన్నయ్య సినిమా కాబట్టి.. ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు హాజరయ్యి ‘అమిగోస్’ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. 10 నిమిషాల పాటు ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ కోసం ఈ ఈవెంట్ చాలా మంది జనాలు వచ్చారు. ఎక్కువ శాతం ఎన్టీఆర్ కోసం వచ్చిన వాళ్ళే అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ స్పీచ్ ఎప్పుడూ కూడా చాలా అందంగా ఉంటుంది.

ప్రతి టెక్నీషియన్ గురించి ఎన్టీఆర్ చాలా బాగా చెబుతాడు. అది తన సినిమాకు సంబంధించిన టెక్నీషియన్ల గురించైనా.. అన్న కళ్యాణ్ రామ్ సినిమా టెక్నీషియన్ల గురించి అయినా సరే..! అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్టీఆర్ స్పీచ్ లో కాకుండా ఎన్టీఆర్ లో ఫైర్ కనిపించింది. అది కూడా ‘ఎన్టీఆర్ అంటూ’ అరిచే తన అభిమానుల పై..! మొదట ‘అమిగోస్’ డైరెక్టర్ గురించి చెబుతున్న టైంలో .. అభిమానులు ఎక్కువగా అరుస్తుంటే ఎన్టీఆర్ ఫైర్ అయ్యాడు.

అటు తర్వాత కూడా చాలా సీరియస్ గా చూశాడు. చివర్లో తన సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ గట్టిగా అరుస్తుంటే.. సీరియస్ లుక్ ఇచ్చిన ఎన్టీఆర్ తర్వాత కంట్రోల్ చేసుకుని ఫ్యాన్స్ ను బుజ్జగించే ప్రయత్నం చేశాడు. సినిమా షూటింగ్ చేస్తున్న ప్రతిరోజు దాని గురించి చెప్పాలి లేదా అప్డేట్ ఇవ్వాలి అంటే ఏమీ ఉండదని.. ఏమైనా అప్డేట్ ఉంటే మా భార్యల కంటే ముందు మీకే చెబుతామని.. మీరే మాకు ముఖ్యమని ఎన్టీఆర్ చెప్పాడు.

మీరు ఇలా దర్శకుడు, నిర్మాతలపై అప్డేట్ ల గురించి ఒత్తిడి పెంచడం మంచిది కాదు అని కూడా ఎన్టీఆర్ చెప్పాడు. అటు తర్వాత తన సినిమా ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమై మార్చి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అని చెప్పాడు. ఎన్టీఆర్ ఇంత కోపంతో ఊగిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఆరా తీస్తే.. నిజానికి ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవ్వడం ఎన్టీఆర్ కు ఇష్టం లేదట.

ఎందుకంటే తన అన్నలాంటి వ్యక్తి తారకరత్న హాస్పిటల్ లో ఉన్నాడు కాబట్టి..! కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ హాజరుకావాలని ఒత్తిడి చేయలేదు. అయితే నిర్మాతలైన ‘మైత్రి’ ఎన్టీఆర్ హాజరుకావాలని ఒత్తిడి చేశారట. ఎన్టీఆర్ కనుక ప్రీ రిలీజ్ కు హాజరైతే ‘అమిగోస్’ ఓపెనింగ్స్ కు అడ్వాంటేజ్ కలుగుతుంది అని వారి అభిప్రాయం. ఇక ‘మైత్రి’ వారితో ఎన్టీఆర్ కూడా సినిమా చేయాలి కాబట్టి కాదనలేక.. ఇష్టం లేకపోయినా హాజరయ్యాడు అని తెలుస్తుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus