Jr NTR, Pawan Kalyan: వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీచ్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా ఈవెంట్ లో మాట్లాడితే ఆ స్పీచ్ ఆకట్టుకునేలా ఉంటుందనే సంగతి తెలిసిందే. అద్భుతంగా స్పీచ్ ఇచ్చే హీరోలలో తారక్ కూడా ఒకరు. తన స్పీచ్ ద్వారా సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు తడబడకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఎన్టీఆర్ మాట్లాడతారు. 2018 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత రిలీజైంది. ఆర్ఆర్ఆర్ లో తారక్ కొమురం భీమ్ రోల్ లో నటించగా ఈ సినిమా మళ్లీ వాయిదా పడటంతో కొత్త రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి, మార్చి నెలలలో పెద్ద సినిమాలకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో ఆర్ఆర్ఆర్ మూవీ ఏప్రిల్ తర్వాతే రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల ఇతర సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా ఒక విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ను ఫాలో అయ్యారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ తన స్పీచ్ ను ముగించే సమయంలో జై హింద్ అంటారనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీ ముంబై ఈవెంట్ లో ఎన్టీఆర్ కూడా తన స్పీచ్ ను జై హింద్ అంటూ ముగించారు. అయితే ఇలా చెప్పడం యాదృచ్ఛికంగా జరిగిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ ముంబై ఈవెంట్ యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంటోంది.

ఈ వీడియోకు ఏకంగా 17 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదలైనా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచింది. నిర్మాత దానయ్య ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus