యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్నేళ్ల క్రితం తారక్ నటించిన మాస్ సినిమాలు వేర్వేరు కారణాల వల్ల ఫ్లాప్ కావడంతో తారక్ మాస్ సినిమాలకు దూరమయ్యారు. టెంపర్, జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాలలో మాస్ ప్రేక్షకులకు నచ్చే కొన్ని అంశాలు ఉన్నా ఈ సినిమాలను పూర్తిస్థాయి మాస్ సినిమాలుగా పరిగణించలేం.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన తర్వాత తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు ఓటేస్తున్నారు. తారక్ కొరటాల శివ కాంబో మూవీ క్లాస్ సినిమాగా తెరకెక్కుతుందని ఫ్యాన్స్ భావించగా కత్తి చేతబట్టి తారక్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపోయేలా చేశారు. ఊరమాస్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని ప్రేక్షకులకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ 31వ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈ సినిమా మాస్ సినిమానే అని ప్రేక్షకుల్లో అభిప్రాయం ఏర్పరిచింది.
తారక్ ను ఏ విధంగా చూడాలని భావిస్తున్నామో చాలా సంవత్సరాల తర్వాత అదే విధంగా చూస్తున్నామని నెటిజన్లు, తారక్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మాస్ సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటే ఎన్టీఆర్ తర్వాత సినిమాలు సైతం మాస్ సినిమాలుగా తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తిరుగులేని మాస్ హీరోగా అవతరించాలని అభిమానులు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ కెరీర్ విషయంలో అడుగులు వేస్తున్న తీరు అభిమానుల్లో సంతోషానికి కారణమవుతోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని అభిమానులు భావించినా అందుకు భిన్నంగా జరగడం గమనార్హం. ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబో మూవీ ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ భావించగా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావడం లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు హిట్టైతే తారక్ రెమ్యునరేషన్ భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!