ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్ణాటక లోని చిక్ బల్లాపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి భారీ స్థాయిలో జనాలు తరలివచ్చారు. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ల ఎంట్రీ అదిరింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బోమ్మై కూడా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ వేడుకకి ముఖ్య అతిథిలుగా విచ్చేసారు. ఇక ఈ వేడుకలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. శివరాజ్ కుమార్ అన్నకి నా స్పెషల్ థాంక్స్. పునీత్ సర్ ఇక్కడ లేరు అనే మాటని నేను ఎప్పుడూ నమ్మలేదు.
Click Here To Watch NEW Trailer
ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు నాకు అనిపించింది.. ఈ గాల్లో, నేలలో, మట్టిలో ఆయన ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందుకే ఈరోజు చల్లని చిరుజల్లులతో మనల్ని ఆయన పలకరించారు. పునీత్ సర్ మనతో లేరని నేను ఎప్పుడూ ఏడవ లేదు. ఎందుకంటే పునీత్ సర్ అంటే సెలెబ్రేషన్. ఆయన్ని ఎప్పుడూ సెలెబ్రేట్ చేస్తూనే ఉందాం. ఆయన లేరు అని ఎప్పుడూ ఏడ్వొద్దు. కన్నడలో నేను మాట్లాడితే వినాలని మా అమ్మ కోరిక. రాజ్ కుమార్‌గారిని చూడాలని ఆమె చాలా కలలు కనేది.
కానీ ఆ భాగ్యం ఈరోజు నాకు దక్కింది. ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది కేవలం సినిమా కాదు. ఇది మా బంధం. చరణ్ అభిమానులందరూ కలిసి ఇక్కడకు వచ్చారు అదే బంధం. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. ప్రాంతీయ చిత్రాల హద్దులను చెరిపేసి.. భారతీ సినిమాగా చేయాలని కలగనే దర్శకుడి కథ. ఈ చిత్రంలో నాక్కూడా ఓ చిన్న పాత్ర ఇచ్చినందుకు, మీరు కట్టబోయే రామసేతులో నాకు ఉడతలాంటి సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్స్.
అలాగే టెక్నికల్ టీం… సెంథిల్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్, క్యాస్టూమ్ డిజైనర్స్.. తల్లి స్థానంలో కూర్చుని ఓ రూపాన్ని కల్పించిన రమా రాజమౌళి. మా తల్లి తరువాతి స్థానంలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వల్లి గారికి, తన సంగీతంతో అందరినీ ఈ సినిమా వైపుకు తిప్పుకున్న కీరవాణి అందరికీ థాంక్స్. మిగతా నటీనటులందరికీ కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక చరణ్‌తో ఈ బంధం ఎప్పుడూ ఇలానే ఉండాలని, మా సాన్నిహిత్యం, ఫ్రెండ్ షిప్ కు దిష్టి తగలకుండా ఉండాలని, నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పి ఎమోషనల్ అయ్యాడు ఎన్టీఆర్.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!