K Ramp: ‘కె ర్యాంప్‌’.. ఇంచుమించు రియల్‌ స్టోరీనట.. ఆ మాటలపైనా క్లారిటీ

‘కె ర్యాంప్‌’ గురించి గత కొన్ని రోజులుగా చాలా చాలా రకాల డిస్కషన్లు నడుస్తున్నాయి. తొలుత ఆ సినిమా టైటిల్‌, ఆ తర్వాత ట్రైలర్‌లోని కొన్ని అసభ్యకర పదాలు, ఆ వెంటనే హీరో కిరణ్‌ అబ్బవరం బయాస్‌ కామెంట్స్‌.. ఇలా చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అలాగే ఈ సినిమా మీద కిరణ్‌ పెట్టుకున్న నమ్మకం, చెబుతున్న మాటలు కూడా డిస్కషన్‌ పాయింట్లే. అయితే ఇప్పుడు వీటితోపాటు మరోక విషయం వచ్చి చేరింది. అదే ఈ సినిమా ఇంచుమించు రియల్‌ స్టోరీనట.

ఈ సినిమా దర్శకుడు జైన్స్‌ నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ప్రత్యేకతలు గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఇది దాదాపు జరిగిన విషయాల నుండి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ అని చెప్పారు. తాము కళాశాలలో చదువుకునేటప్పుడు స్నేహితులతో కలసి చేసిన అల్లరి… అక్కడే నాకు పరిచయమైన ఓ అమ్మాయి తదితర సంఘటనల స్ఫూర్తితో ‘కె – ర్యాంప్‌’ కథను రాసుకున్నా అని జైన్స్‌ నాని తెలిపారు. మద్రాస్‌ ఐఐటీలో చదువుకునేటప్పుడు కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశారు జైన్స్‌ నాని. వాటితో మంచి పేరు కూడా సంపాదించుకున్న విషయం తెలిసిందే.

చిన్నప్పటి నుండి జైన్స్‌ నానికి సినిమాపై ఆసక్తి ఉండేదట. అందుకే ఉద్యోగం వచ్చినా వదిలేసి, ఇంట్లో వాళ్లని ఒప్పించి సినిమా రంగంలోకి వచ్చారు. కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. ఆ సమయంలోనే కిరణ్‌ అబ్బవరానికి కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌లోని ఇబ్బందికర పదాల గురించి కూడా మాట్లాడాడు. ఏ సినిమా అయినా ముందు థియేటర్‌కి వచ్చేది యువతరమే. వాళ్లని ఆకర్షించాలనే ప్రయత్నంలోనే ట్రైలర్‌ని అలా సిద్ధం చేశాం అని చెప్పారు.

అయినా ఒకట్రెండు మాటల్నిబట్టి సినిమాను కేటగిరైజ్‌ చేయొద్దు అని కూడా సూచించారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే అంశం ఉంది అని కూడా చెప్పారాయన. యువతరమే కాదు, వాళ్ల తల్లిదండ్రులూ తప్పక చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు జైన్స్‌ నాని. యువతరానికి నచ్చిందంటే వాళ్లే కుటుంబ ప్రేక్షకుల్నీ తీసుకొస్తారనేది డైరక్టర్‌ నమ్మకట.

మనసులో మాట చెప్పిన రాశీ ఖన్నా.. మరి ఎవరు ఆ కథ రెడీ చేస్తారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus