Jr NTR: ఆ ఘటన వల్ల బాధలోనూ నవ్వడం నేర్చుకున్న ఎన్టీఆర్.. ఏమైందంటే?

  • May 20, 2023 / 05:59 PM IST

బాల నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి తర్వాత రోజుల్లో వరుస విజయాలను ఖాతాలో వేసుకుని అభిమానులకు దగ్గరైన స్టార్ హీరోగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పేరుంది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. తారక్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సింహాద్రి మూవీ రీ రిలీజ్ కావడంతో పాటు 1000కు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తారక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేనంటే అమ్మకు ప్రాణమని వాస్తవంలో బ్రతకడమే అమ్మ నాకు నేర్పిందని అమ్మే నా బలం బలగం అని చెప్పుకొచ్చారు.

నాన్న ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయే వరకు నాన్న ఒక దృక్పథంతో ఉన్నారని నాన్నలా బ్రతకడం కష్టమని తారక్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు తారక్ రామ్ అనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ సూచన మేరకు ఆయన పేరు నందమూరి తారక రామారావుగా మారింది. భార్య లక్ష్మీ ప్రణతి నాకు దేవుడిచ్చిన వరం అని ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఇద్దరు కొడుకులు ఉన్నా కూతురు లేని లోటు ఎప్పటికీ ఉంటుందని తారక్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. స్కూల్ ఫ్రెండ్స్ కు తారక్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో తారక్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. 2009 సంవత్సరంలో తారక్ కారు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ కారు ప్రమాదం నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చిందని బాధలోనూ నవ్వడం నేర్చుకున్నానని తారక్ ఒక సందర్భంలో పేర్కొన్నారు.

జపాన్ లో విశేషమైన క్రేజ్ ఉన్న హీరోలలో (Jr NTR) తారక్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. సినిమా సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus