Jr NTR: ఎన్టీఆర్ పై స్పెషల్ ఎడిషన్.. మెస్మరైజ్ చేశాడంటూ?

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ ఖాతాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఈ సినిమాలో చరణ్ రామరాజు పాత్రలో నటించి మెప్పించగా తారక్ భీమ్ పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇద్దరు హీరోలు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి సినిమా సక్సెస్ కు కారణమయ్యారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 1150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడం గమనార్హం. జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీలలో కుడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. ఇజ్రాయెల్ న్యూస్ పేపర్ లో తారక్ పోషించిన భీమ్ పాత్ర గురించి, తారక్ గురించి స్పెషల్ ఎడిషన్ ప్రచురితమైంది. ఒక ఫుల్ పేజీలో ఎన్టీఆర్ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో, యాక్షన్ సన్నివేశాల్లో నటించిన తీరు గురించి గొప్పగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ దేశంలో తారక్ క్రేజ్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ఇజ్రాయెల్ లో తారక్ హవా మామూలుగా లేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తన నటనతో ప్రేక్షకులను తారక్ మంత్రముగ్ధుల్ని చేయడంతో తారక్ కు ఈ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. తారక్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా ఈ హీరోకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాదని తెలుస్తోంది. తారక్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారక్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తారక్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus