Jr NTR, Narne Nithiin: తారక్ బావమరిది 4 సినిమాలు ఓకే అయ్యాయా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయడమే సరైన నిర్ణయమని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. ఎన్టీఆర్ తన బావమరిది అయిన నార్నె నితిన్ సక్సెస్ కావడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు తన కొడుకు నితిన్ కెరీర్ లో కచ్చితంగా సక్సెస్ కావాలని భావిస్తున్నారు.

నార్నె నితిన్ వరుసగా నాలుగు సినిమాలలో నటిస్తున్నారని నార్నె శ్రీనివాసరావు తన కొడుకు కోసం ఏకంగా 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈ నాలుగు సినిమాలకు ఇప్పటికే డైరెక్టర్లు ఫిక్స్ అయ్యారని బోగట్టా. నార్నె నితిన్ తొలి మూవీకి ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. నార్నె నితిన్ రెండో మూవీకి ప్రముఖ దర్శకుడు అశోక్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. నార్నె నితిన్ ప్రముఖ దర్శకుల డైరెక్షన్ లో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

మరోవైపు నార్నె నితిన్ కెరీర్ విషయంలో సక్సెస్ కావడానికి ఎన్టీఆర్ తన వంతు సహకారం అందిస్తున్నారని బోగట్టా. ఎన్టీఆర్ కథ విని ఆ కథ నచ్చితే మాత్రమే నార్నె నితిన్ నటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నార్నె నితిన్ హీరోగా స్టార్ స్టేటస్ ను అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. నార్నె నితిన్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మద్దతు కూడా లభిస్తోంది. మరోవైపు త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమా కథ రివేంజ్ స్టోరీ అని ఎన్టీఆర్ పాత్ర కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది. తారక్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus