మన తెలుగు సినిమాకి మొదటిసారి ఆస్కార్ అవార్డు లభించింది. 90 ఏళ్ళ సినీ చరిత్రలో ఇలాంటి అద్భుతం జరగడం ఇదే మొదటిసారి. 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ లభించింది.జాతీయ అవార్డులే రాక విలవిలలాడుతున్న ఇండస్ట్రీ మనది. అలాంటిది ఆస్కార్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. రిహానా వంటి హాలీవుడ్ పాపులర్ సింగర్స్ పాడిన పాటలు పోటీలో ఉన్నా వాటన్నింటినీ పక్కకు నెట్టి ‘నాటు నాటు’ ఆస్కార్ గెలవడం ఇంకో విశేషంగా చెప్పుకోవాలి.
ఈ పాటను ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ అలాగే బిగ్ బాస్3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రపంచవ్యాప్తంగా 81 పాటలు ‘బెస్ట్ ఒరిజనల్ సాంగ్స్’ కేటగిరీలో ఆస్కార్ కు ఎంట్రీ ఇచ్చాయి. నాటు నాటు తో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్),హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్:మావెరిక్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) వంటి 5 పాటలు టాప్ 5 లో నిలిచాయి.
ఫైనల్ గా ‘నాటు నాటు’ పాట గెలిచింది. ఇక ఆస్కార్ అవార్డుల వేడుకల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుతో ఫోజులు ఇచ్చాడు. అలాగే ‘ఇది జస్ట్ బిగినింగ్’ అంటూ ఎన్టీఆర్ కామెంట్ చేశాడు. ఎన్టీఆర్ కూల్ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్