Jr NTR, Rajamouli: రాజమౌళి ఎక్స్‌ప్రెషన్‌… తారక్‌ ఇమిటేషన్‌ అదరహో!

భారీ సినిమాలు తీస్తారు, ఇంకా భారీగా రిలీజ్‌ చేస్తారు, అంతే భారీస్థాయిలో ప్రమోషన్స్‌ చేస్తారు, భారీ కలెక్షన్లు సాధిస్తారు. ఇంత చేసే మనిషి… ముఖాన ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది అంటే చాలా గ్రేట్‌ అని చెప్పాలి. ఆ మనిషి ఎవరో దర్శకధీరుడు అంటూ టాలీవుడ్‌ ముద్దుగా పిలుచుకునే రాజమౌళి. కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలే చేసినా… ఆయన విజన్‌ మాత్రం దేశం గర్వించదగ్గ సినిమాలు చేయడమే. ‘బాహుబలి’తో ఆ పని మొదలుపెట్టి ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వస్తున్నారు.

Click Here To Watch Now

అయితే రాజమౌళి ఏ విషయాన్నైనా ఎలా సులభంగా నెట్టుకొస్తారు అంటే ఆ నవ్వే అని చెప్పాలి. సినిమా ప్రచారంలో భాగంగా రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావుతో వినోదాల దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా రాజమౌళిని ఇమిటేట్‌ చేయమని తారక్‌ను అనిల్‌ రావిపూడి అడిగారు. షూటింగ్‌ స్పాట్‌లో రాజమౌళి ఎలా బిహేవ్‌ చేస్తారు అనేది చెప్పమని కోరారు. అయితే తారక్‌ ఆ విషయం చెప్పకుండా రాజమౌళి ట్రేడ్‌మార్క్‌ ఎక్స్‌ప్రెషన్‌ గురించి వివరించారు.

ఇంకా చెప్పాలంటే ఇమిటేట్‌ చేసి మరీ చూపించారు. ఏదైనా అడిగితే జక్కన్న ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తారు అనేది చేసి మరీ చూపించాడు తారక్‌. ఆ సందర్భంలో తారక్‌గా అనిల్‌ రావిపూడి మారితే, జక్కన్నగా ఎన్టీఆర్‌ మారిపోయారు. జక్కన్న అంటే తనకు చాలా ఇష్టమని, అయితే ఓ విషయంలో మాత్రం బాగా ఇరిటేషన్‌ వస్తుంది అని చెబుతూ రాజమౌళి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ని చూపించాడు. ‘జక్కన్న పాట చూపించవా? అని అడిగితే…’ దానికి ఆయన అడ్డంగా తలూపితూ నవ్వుతారట. ఆ ఎక్స్‌ప్రెషన్‌ చూడగా సుర్రున కాలుతుంది అని చెప్పాడు తారక్‌.

షూటింగ్‌ నుండి త్వరగా వదిలిపెడతావా అని అడిగినా అదే రకమైన ఎక్స్‌ప్రెషన్‌ వస్తుందట. అంతెందుకు ఏది అడిగినా… అలానే నవ్వుతారు అంటూ తారక్‌ నటించి చూపించాడు. సినిమాకు సంబంధించి ఏ విషయం అడిగినా.. ఆయన అలా నవ్వేసి ఊరుకుంటాడని రామ్‌చరణ్‌ కూడా చెప్పాడు. తారక్‌ ఇలా ఇమిటేట్‌ చేస్తుంటే పక్కన రాజమౌళి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చూసి సరదా పడిపోయారు. టూ కూల్‌ కదా జక్కన్న. అందుకే అంత భారీ సినిమాలు చేస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus