Jr NTR: ఎన్టీఆర్ కి గాయాలు.. స్పందించిన టీం.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) షూటింగ్ టైమ్ లో గాయపడటం అనేది కొత్త విషయం ఏమీ కాదు. స్టూడెంట్ నెంబర్ 1 (Student No: 1) , అది (Aadi) , సింహాద్రి (Simhadri) , అదుర్స్ (Adhurs) , బృందావనం (Brindavanam) , ఆర్.ఆర్.ఆర్  (RRR) వంటి సినిమాల చిత్రీకరణ దశలో ఎన్టీఆర్ కి గాయాలు. అయినా సరే ఎన్టీఆర్ వాటిని లెక్క చేయకుండా.. షూటింగ్లలో పాల్గొని సినిమాలు కంప్లీట్ చేశాడు. విచిత్రం ఏంటో కానీ ఆ సినిమాలు అన్నీ సక్సెస్ సాధించాయి. ఈ విషయంలో కూడా ఎన్టీఆర్ తన తాతగారు అయిన సీనియర్ ఎన్టీఆర్ ను మ్యాచ్ చేశాడు అని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు.

Jr NTR

అయితే అభిమానులకు మాత్రం ఎప్పుడూ ఈ విషయంలో కంగారుగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ మరోసారి గాయపడినట్టు తెలుస్తుంది వివరాల్లోకి వెళితే… రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ గాయపడ్డారట. జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న క్రమంలో అతని ఎడమ చేతికి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్యుల సమక్షంలో చికిత్స పొందారని సమాచారం. ఇక గాయాన్ని లెక్క చేయకుండానే ఎన్టీఆర్ ఆ రోజు దేవర షూటింగ్ కంప్లీట్ చేశాడు అని తెలుస్తుంది.

ఇక 2 వారాల తర్వాత దేవర (Devara) షూటింగ్ కి సంబంధించి నెక్స్ట్ షెడ్యూలు మొదలవుతుంది అని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ పరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది. 2 వారాల్లో అతను పూర్తిగా కోలుకుంటారు అని స్పష్టమవుతోంది. ఇక దేవర చిత్రం సెప్టెంబర్ 27 న విడుదల కావాల్సి ఉంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus