Jr NTR: ఆ వ్యక్తి గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్!

  • June 16, 2023 / 02:36 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి తారక్ ప్రస్తుతం తన సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇలా ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ కు చాలా మంది ప్రాణ స్నేహితులు ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఎన్టీఆర్ ప్రాణ స్నేహితులలో ప్రముఖ రాజకీయ నాయకుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొడాలి నాని కూడా ఒకరు. వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ కొడాలి నాని గురించి గతంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ కొడాలి నాని గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

చిన్నప్పటినుంచి కొడాలి నాని అంటే తనకు చాలా ఇష్టం ఎప్పుడూ కూడా నా నుంచి ఏది ఆశించలేదు. తను చాలా మంచి మనసు అంటూ కొడాలి నాని గురించి తెలియజేశారు. ఇక నా కోసం ఎంతోమంది ప్రాణాలు ఇస్తారు వారి సంగతి పక్కన ఉంచితే నేను ప్రాణాలు ఇచ్చే స్నేహితులలో కొడాలి నాని ఒకరు.

తనకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తాను సిద్ధమేనంటూ (Jr NTR) ఎన్టీఆర్ గతంలో కొడాలి నాని గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా కొడాలి నాని గురించి ఎన్టీఆర్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి స్నేహబంధం ఉందో అర్థమవుతుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus