Jr NTR, Rajamouli: రాజమౌళి అలాంటి వ్యక్తి అంటున్న తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటి సాహెబా బాలీకి బిర్యానీ, మరికొన్ని వంటకాలను తారక్ రుచి చూపించారు. ఎన్టీఆర్ తను వడ్డించిన వంటకాల ప్రాముఖ్యతను కూడా సాహెబాకు తెలియజేశారు. ఆ తర్వాత సాహెబా ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ మూవీలో మీరు నిజమైన పులితో ఫైట్ చేశారట? నిజమేనా అని అడిగారు. ఆ ప్రశ్నకు తారక్ స్పందిస్తూ అయుండొచ్చు కాకపోవచ్చు అంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు.

మీకు ఎన్ని భాషలు వచ్చు అనే ప్రశ్నకు తారక్ స్పందిస్తూ తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలు వచ్చని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నటులను, డైరెక్టర్ జక్కన్నను వంటకాలతో పోల్చిన ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళిని బిర్యానీతో పోలుస్తూ బిర్యానీ చూడటానికి సింపుల్ గా ఉన్నా చేయాలంటే కష్టపడాలని తారక్ అన్నారు. బిర్యానీని తయారు చేయాలంటే అన్నీ పర్ఫెక్ట్ గా కుదరాలని ఎన్టీఆర్ పేర్కొన్నారు. రాజమౌళి కూడా చూడటానికి సింపుల్ గా ఉంటారని పని విషయంలో మాత్రం ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉంటారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

పానీపూరిని చూడగానే దాని ఫ్లేవర్స్ బయటపడతాయని చరణ్ కూడా అంతేనని తారక్ తెలిపారు. రామ్ చరణ్ తో మాట కలిపితే అన్ని విషయాలు పంచుకుంటాడని తారక్ చెప్పుకొచ్చారు. అలియా భట్ ను ఇరానీ బన్‌ మస్కాతో పోల్చిన ఎన్టీఆర్ ఇరానీ బన్‌ మస్కా ఎంతో ఆరోగ్యమైనది అని తెలిపారు. అజయ్‌ దేవగణ్ ను ఎన్టీఆర్ వడా పావ్ తో పోలుస్తూ ముంబై లోకల్ ఫుడ్ అక్కడివారికి కచ్చితంగా ఏ విధంగా కావాలో అజయ్ దేవగణ్ కూడా అదే విధంగా అందరికీ కావాల్సిన వ్యక్తి అని ఎన్టీఆర్ అన్నారు.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ టీంను వంటకాలతో పోల్చుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలు కానుందని సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus