Jr NTR: ఎన్టీఆర్ పాన్ ఇండియా తెలివితేటలు సూపరో.. సూపరు..!

ఇటీవల విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సంపాదించున్న ఈ మూవీ రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. హీరో యష్ ను ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన తీరుకి మాస్ ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. మాస్ ను ఆకర్షించడంలో ప్రశాంత్ నీల్ పి.హెచ్.డి చేసాడేమో అనే రేంజ్ లో ఉన్నాయి ఈ సినిమాలో ఎలివేషన్లు. ట్రాజెడీ ఎండింగ్ కు కూడా అతను ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు.

Click Here To Watch NOW

ప్రస్తుతం అతనితో సినిమా చేయాలని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఈ మూవీ ఫినిష్ అయ్యాక ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నట్టు ప్రశాంత్ నీల్ ప్రకటించాడు. నిజానికి ‘సలార్’ ప్రారంభమవ్వడానికి ముందు నుండే ఎన్టీఆర్‌ తో మూవీ అనౌన్స్ చేసాడు ప్రశాంత్ నీల్. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఆ మూవీని నిర్మించబోతున్నారు.

అయితే ‘కె.జి.ఎఫ్’ రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్.. అల్లు అర్జున్,రామ్ చరణ్ లను కలిసి కథలు వినిపించాడు. కానీ వాళ్ళు డేట్స్ ఖాళీ లేవు అంటూ తప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రశాంత్ నీల్ తో సినిమా ఓకె చేయకుండా తప్పు చేసినట్టు ఫీలవుతున్నారట. ఎందుకంటే వాళ్ళకి కూడా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ‘పుష్ప’ తో బన్నీ, ‘ఆర్.ఆర్.ఆర్’ తో చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

కానీ ఇప్పుడు దానిని కొనసాగించాలి అంటే ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడే కరెక్ట్. ఈ విషయంలో ఎన్టీఆర్ గ్రేట్ అని చెప్పాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ తో అతనికి కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు అతనికి తోడైతే పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత పెంచుకునే అవకాశాలు ఉంటాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus