Jr NTR, Koratala Siva: ఎన్టీఆర్ కొరటాల మూవీపై షాకింగ్ రూమర్!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా కథల విషయంలో ఎలాంటి పోలిక లేకుండా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. భిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఈ స్టార్ డైరెక్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కొరటాల శివ ఇప్పటికే ఆచార్య మూవీ షూటింగ్ ను పూర్తి చేయగా కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా తర్వాత సినిమా షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ తరహా పాత్రలో కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Click Here To Watch

బన్నీ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ తో కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం కొరటాల శివ మూఢనమ్మకాలకు సంబంధించిన కథతో తారక్ మూవీని తెరకెక్కించనున్నారని బోగట్టా. టెక్నాలజీ వల్ల ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొందరు మాత్రం నేటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. కొందరు ఈ మూఢనమ్మకాల వల్ల పక్కదారి పడుతున్నారు. మూఢనమ్మకాలను నమ్మే వాళ్ల ఆలోచనలలో మార్పు వచ్చేలా కొరటాల శివ కథను తీర్చిదిద్దారని సమాచారం.

పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తారక్ కు జోడీగా ఈ సినిమాలో అలియా భట్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా షూటింగ్ జరుపుకుని ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ పూర్తైన తర్వాత తారక్ ఈ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత అదే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదనే సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో నటించే హీరోకు తర్వాత మూవీ ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. కొరటాల శివ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus