ఎన్టీఆర్ నుండి మొన్నీ మధ్య ‘ఆర్ఆర్‌ఆర్’ వచ్చింది. అయితే ఇది ఆయన నుండి మూడున్నరేళ్ల తర్వాత వచ్చిన సినిమా. ‘ఆర్ఆర్‌ఆర్’ కంటే ముందు ఆయన ‘అరవింద సమేత’తో వచ్చారు. మామూలుగా మన స్టార్ హీరోలుగా ఏటా ఒకటి లేదంటే రెండు సినిమాలు తీస్తుంటారు. ఆ లెక్కన ఎన్టీఆర్ సుమారు 7 సినిమాలు బాకీ పడ్డాడు. ఈ బాకీని వీలైనంత త్వరగా తీర్చేయాలని చూస్తున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తారక్ తన కొత్త సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడట.
తారక్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి సినిమా మొదలైపోయేదే. కానీ వివిధ కారణాల వల్ల సినిమా ప్రారంభం ఆలస్యమవుతోంది. ‘ఆర్‌ఆర్ఆర్’ హడావుడి, ప్రచారం, సక్సెస్‌మీట్‌లు అయిపోవడంతో త్వరలోనే స్టార్ట్ చేస్తున్నారట. హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తాం అని తారక్ ఇటీవల చెప్పాడు కూడా. అయితే ఈ సినిమాకు కాల్‌షీట్ల విషయంలో తారక్ డెసిషన్ బయటికొచ్చింది. అదే జరిగితే తారక్ ఫ్యాన్స్‌కు ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు.
కొరటాల శివ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తారక్ అనుకుంటున్నాడట. సుమారు 70 రోజుల్లో సినిమాను పూర్తి చేసేయాలని కొరటాల శివకు తారక్ డెడ్‌లైన్ పెట్టాడట. సినిమా మొదలయ్యేలోపు ఫుల్‌గా రెడీ అయ్యి అనుకున్న టైమ్‌లో పూర్తి చేసేయాలని చూస్తున్నాడట. ఇలా చేస్తేనే వేగంగా సినిమాలు సిద్ధం చేసి, అనుకున్న టైమ్‌కి విడుదల చేయొచ్చు అనుకుంటున్నాడట. లేకపోతే బాకీపడ్డ సినిమాల్ని తీర్చేలేం అనుకుంటున్నాడట. ఇక కొరటాల వైపు నుండి కూడా ఇదే పరిస్థితి.
‘భరత్ అనే నేను’ తర్వాత కొరటాల శివ సినిమా రాలేదు. ఇంకా చెప్పాలంటే తారక్ కంటే కొరటాల సినిమానే వచ్చి ఎక్కువ రోజులైంది. ఈ నెలాఖరున ‘ఆచార్య’ వచ్చి ఆ ముచ్చట తీర్చబోతోంది. దీంతో ఈ గ్యాప్‌ను కవర్ చేయడానికి కొరటాల కూడా సినిమాను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!