Jr NTR,Koratala Siva: కొరటాల కోసం జూనియర్ ఎన్టీఆర్ అలా చేశారా?

ఆచార్య సినిమా విడుదలయ్యే వరకు దర్శకునిగా కొరటాల శివ రేంజ్ మరో విధంగా ఉండేది. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కితే ఆ సినిమా హిట్ అని చాలామంది భావించేవారు. అయితే ఆచార్య సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోవడంతో ఈ సినిమాకు కొరటాల శివ నిజంగానే దర్శకత్వం వహించారా? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. కొరటాల శివ తర్వాత సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనుంది.

జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది. కొరటాల శివ కథలో తారక్ కీలక మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. కథా చర్చల్లో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సీన్ ను జాగ్రత్తగా చెక్ చేస్తూ కథ మరింత మెరుగ్గా రావడానికి తన వంతు శ్రమిస్తున్నారని సమాచారం. స్క్రిప్ట్ పక్కాగా వచ్చేవరకు షూట్ మొదలుపెట్టకూడదని ఎన్టీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఆగష్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని ప్రచారం జరుగుతుండగా ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలుకానుంది. మాస్ కథలతోనే ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు తెరకెక్కనున్నాయి. సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్, మార్కెట్ పెరుగుతుంది.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లు తన రేంజ్ ను మరింత పెంచేలా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్ లక్ష్యం ఈ సినిమాలతో నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తయ్యాక ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus