Jr NTR: శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా… ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.గత కొద్ది రోజుల క్రితమే ఈయన అమెరికా వెళ్లాల్సి ఉండగా తారకరత్న మరణ వార్తతో కాస్త ఆలస్యంగా అమెరికాలో అడుగు పెట్టారు. ఈనెల 12వ తేదీ ఆస్కార్ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో ఆస్కార్ నామినేషన్ లో నిలిచినటువంటి RRRసినిమా ప్రమోషన్ల కోసం ఇప్పటికే రామ్ చరణ్ రాజమౌళి వంటి వారందరూ కూడా అమెరికాలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా తాజాగా అమెరికా వెళ్లారు.

అయితే ఈయన అమెరికా వెళ్ళగానే అక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ అభిమానులను ఉద్దేశించి వారు చూపుతున్నటువంటి ప్రేమకు ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమను వర్ణించడం చాలా కష్టం మీపై అంతకుమించి నా గుండెల్లో ప్రేమ దాగి ఉంది కానీ దాన్ని నేను చూపించలేనని తెలియజేశారు.

మీరు చూపించే ప్రేమకు మీరు పైన ఉండాలి నేను కిందనే ఉండాలని తెలిపారు.నేను ఏం చేసి మీకు ఇంత దగ్గర అయ్యానో నాకు తెలియదు మన మధ్య రక్త సంబంధం కన్నా ఏదో గొప్ప బంధం ఉంది. మీరు మా బ్రదర్ అన్నయ్యా’ అని ఓ అభిమాని అంటే… ”మీరు అందరూ నా బ్రదర్స్” అని ఎన్టీఆర్ బదులు ఇచ్చారు. ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇలా మీ అందరి ప్రేమాభిమానాలు కనుక చూస్తుంటే మరో జన్మంటూ ఉంటే నేను ఎన్టీఆర్ లాగే పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వస్తుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఆస్కార్ చేత పట్టుకొని స్వదేశానికి రావాలని చిత్ర బృందం కూడా అమెరికాలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus