Jr NTR: అలా జరగడం వల్ల ఎన్టీఆర్ ఆదాయం తగ్గిందా?

గతేడాది డిసెంబర్ సమయానికి ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సహా పూర్తైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తెరకెక్కాల్సిన ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తోంది. వాస్తవానికి గతేడాది కొరటాల శివ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని వెల్లడించారు. ఆ తర్వాత అలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ ఎన్టీఆర్30 సినిమాకు ఆవాంతరాలు ఎదురవుతున్నాయి.

ఇతర స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో, యాడ్స్ తో బిజీగా ఉండగా తారక్ మాత్రం షూటింగ్ లకు దూరంగా ఉండటం అభిమానులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఆదాయం విషయంలో తారక్ సులువుగా ఈ ఏడాది 50 నుంచి 60 కోట్ల రూపాయలు నష్టపోయారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇప్పటికే కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరింత బరువు తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే తారక్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్ కొరటాల శివ కాంబో మూవీ కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొరటాల శివ కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎంతోమంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన కొరటాల శివ ఎన్టీఆర్30 సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవాలని భావిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా తారక్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus