యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వరుసగా ఆరు సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ట్రిపులార్ రిలీజ్ అయ్యి 8 నెలల అవుతున్నా ఇంకా అదే మూడ్‌లో, హ్యాపీ మోడ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ జపాన్ ప్రమోషన్స్‌లో జపనీస్ లాంగ్వేజ్‌లో మాట్లాడి మరోసారి తన టాలెంట్‌తో అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. కొరటాల శివతో చేయబోయే తన తర్వాత సినిమా అప్డేట్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఓ సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చాడు తారక్.
తారక్ గురించి.. పర్సనల్ అయినా.. ప్రొఫెషనల్ అయినా.. ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ దాన్ని క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు అభిమానులు.. రీసెంట్గా వచ్చిన ఓ క్రేజీ అప్డేట్ కూడా ఇప్పుడలానే ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సినిమాలు, మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి టాక్ షోలే కాకుండా.. పలు కమర్షియల్స్‌లోనూ యాక్ట్ చేసి దుమ్ము దులిపాడు జూనియర్. తన ఖాతాలో మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది.
‘మేకింగ్ ఏ స్పెషల్ ఎంట్రన్స్ సూన్’ అంటూ త్వరలో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఓ సాలిడ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బ్లాక్ సూట్లో టైగర్ వెనక్కి తిరిగి ఉన్న పిక్‌ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. పాపులర్ ఇండియన్ ఫుడ్ డెలివరీ హబ్ లిసియస్ ఫుడ్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా తారక్ కనిపించనున్నాడు. ఇటీవలే ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్కి సంబంధించిన షూట్లో కూడా పాల్గొన్నాడట. మొన్నామధ్య వైరల్ అయిన తారక్ న్యూలుక్ ఈ ప్రకటనలోనిదే అని అంటున్నారు.
‘జరుగబోయే సంచలనం ఊహించగలారా?’ అంటూ హింట్ ఇస్తూ వస్తున్న లిసియస్ ఫుడ్స్ తమ బ్రాండ్‌కి యంగ్ టైగర్ ప్రమోషన్ చేయనున్నట్లు తమ అఫీషియల్ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేశారు. త్వరలో తారక్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్న యాడ్స్ రిలీజ్ చేయనున్నారు. దీని అనౌన్స్మెంట్కి సంబంధించిన ప్రెస్ మీట్ త్వరలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇంతకుముందు నవరత్న ఆయిల్, యాపీ ఫీజ్, సెలెక్ట్ మొబైల్స్, ఓట్టో వంటి బ్రాండ్లకు ప్రమోటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.