Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లానింగ్ ఇదేనా?

ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమా సక్సెస్ లో ఎన్టీఆర్ తో పాటు చరణ్ కు కూడా వాటా ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధించినా మరో పాన్ ఇండియా సక్సెస్ దక్కితే మాత్రమే ఎన్టీఆర్ కెరీర్ కు ప్రయోజనం చేకూరుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు.

Click Here To Watch NOW

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కుతున్నప్పటికీ కొరటాల శివ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించే కథతో సినిమా తెరకెక్కిస్తే మాత్రమే ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు తెరకెక్కినా తారక్ కెరీర్ కు ఈ సినిమా ఊహించని స్థాయిలో ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం తారక్ తో సినిమాను తెరకెక్కించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో సినిమాలను తెరకెక్కించాలని ఆశ పడుతున్న దర్శకుల జాబితాలో బుచ్చిబాబు సన, అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం కెరీర్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ఎఫ్3, బాలయ్య అనిల్ కాంబో మూవీ సక్సెస్ సాధిస్తే మాత్రం అనిల్ రావిపూడికి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.

మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు కాగా ఆరోజు ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించి మరింత క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే దర్శకుల వైపు చూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కథ నచ్చితే బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి కూడా తారక్ సిద్ధమేనని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus