Jr NTR Watch Price: మరో కాస్ట్‌లీ వాచ్‌ కొనేసిన తారక్‌.. ఫొటోలు వైరల్‌!

తారక్‌కి బాగా ఇష్టమైన వస్తువులు ఏంటి అంటే… వాచీలు, కార్లు అని ఫ్యాన్స్‌ ఠక్కున చెప్పేస్తుంటారు. తరచుగా ఎన్టీఆర్‌ కొత్త కార్లు, వాచీల గురించి వార్తలు వస్తుంటాయి. కార్ల విషయంలో అయితే రిజిస్ట్రేషన్‌లకు బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇక వాచీల సంగతి అయితే ఎన్టీఆర్‌ ఏదైనా ఈవెంట్‌కి వచ్చినప్పుడు చూసి తెలుసుకోవడమే. తాజాగ ఎన్టీఆర్‌ ఓ కార్యక్రమం కోసం వచ్చాడు. ఇంకేముంది తారక్‌ చేతికి పెట్టుకున్న వాచ్‌ కెమెరాల కంటపడింది. ఇక చాలు ఆ వాచీ గురించి సెర్చింగ్‌ మొదలుపెట్టేశారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విజయాన్ని పురస్కరించుకొని, రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో ముంబయిలో పెద్ద పార్టీ జరిగింది. దానికి తారక్‌ ఓ వాచీ పెట్టుకుని వచ్చాడు. చూడగానే అట్రాక్టివ్‌గా అనిపిచడంతో అభిమానులు ఆ వాచ్‌ గురించి సెర్చ్‌ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో అందరూ షాక్‌ అయ్యారట. అయితే తారక్‌ వాచీల ప్రేమ గురించి తెలసినోళ్లు మాత్రం ఇది అలవాటే కదా అనుకున్నారట. ఎందుకంటే ఆ వాచీ ఖరీదు రూ. కోటిన్నర పైమాటే.

తారక్‌ పెట్టుకున్న వాచీ పేరు Patek Philippe Nautilus 5712 1/A 08/2020. పేరు చూస్తేనే చెప్పేయొచ్చు ఈ వాచీ విదేశాలకు చెందింది అని. ఇక ధర విషయానికొస్తే రూ. కోటీ 70 లక్షల వరకు ఉంది. ధర బట్టి అర్థం చేసుకోవచ్చు అదెంత స్పెషల్‌ వాచీ అనేది. అయితే ఈ వాచీ గురించి ఎన్టీఆర్‌ కానీ, టీమ్‌ కానీ మాట్లాడరు. గతంలో ఇదే జరిగింది. కాబట్టి. ఇటీవల కూడా తారక్‌ చేతికి ఇలాంటిదే కాస్ట్‌లీ వాచ్‌ ఒకటి కనిపించింది.

ఆ వాచీ ధర ఆన్‌లైన్‌ మార్కెట్‌లో సుమారు నాలుగు కోట్ల రూపాయలు. రిచర్డ్‌ మిల్లే ఆర్‌ఎం 011 వాచ్‌ అది. అందులో ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ అంట. ఇక తారక్‌ దగ్గర భారీ ధరల వస్తువులు ఇప్పటికే చాలా ఉన్నాయి. లంబోర్గిని ఉరుస్‌ మోడల్‌ కారు తారక్‌ సొంతం. దీని ధర ఐదు కోట్ల రూపాయల పైమాటే. సోదరుడు కల్యాణ్రామ్‌ గతంలో తారక్‌కు కోటి రూపాయల విలువున్న వాచ్‌ ఒకటి ఇచ్చాడు. ఇక కారవాన్‌ సంగతి సరే సరి.

తన కోసం ప్రత్యేక వోల్వో కారవాన్‌ కూడా సిద్ధం చేయించుకున్నాడు తారక్‌. ఇక తారక్‌ కార్ల నెంబర్ల గురించి సరేసరి. ఆ మధ్య 9999 నెంబరు కోసం సుమారు 11 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇక ముందు చెప్పినట్లు రిచర్డ్‌ మిల్లే వాచ్‌ మరొకటి కూడా అతని దగ్గర ఉంది. దాని ధర సుమారు రెండున్నర కోట్లు.

1

2

3

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus