Jr NTR: ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన యంగ్ టైగర్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. దేవర సినిమా ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ శ్రీకాంత్ కూతురిగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఫిబ్రవరి నెల రెండో వారం వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుందని భోగట్టా. నెలరోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. అయితే అభిమానులకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

న్యూ ఇయర్ సందర్భంగా తారక్ శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. తారక్ నుంచి వచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. త్వరలో దేవర గ్లింప్స్ రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా ఈ గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

దేవర గ్లింప్స్ ఒకింత స్పెషల్ గా ఉండనుందని గ్లింప్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారంటీ అని సమాచారం అందుతోంది. దేవర మూవీ గ్లింప్స్ విడుదలైతే ఈ సినిమా కథ గురించి కూడా ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. దేవర సినిమా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. రెండు భాగాలుగా దేవర మూవీ తెరకెక్కుతోంది.

దేవర సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా ఖర్చు విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. దేవర సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని భోగట్టా.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus