టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన చిరు ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి సినిమాలకు దూరం అయ్యారు. ఇదిలా ఉంటే చిరు బ్యాక్ గ్రౌండ్ తో చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టిస్తున్నారు. వారిలో చెర్రీ, బన్నీ, సాయి ధర్మ తెజ్, అల్లు శిరీష్ ఇలా యువ హీరోలు అందరూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక అదే క్రమంలో ట్రెండ్ తో, పోటీతో సంభందం లేకుండా చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కూడా అభిమానులను అలరిస్తున్నాడు. ఇక అసలు కధకు వెళితే…ఇండస్ట్రీ రికార్డ్స్ పై చిరు సర్దార్ ఆడియోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ సభలో చిరు మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఇప్పుడు అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయని..ఆ మద్య రిలీజ్ అయిన ‘బాహుబలి’ తెలుగు వాడి సత్తాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిందని..కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన రికార్డు స్థాపించిందని అన్నారు.
ఆ రికార్డ్ ను మన సర్దార్ బ్రేక చెయ్యాలి అని, ఇక ఆ రికార్డ్ ను మరో సినిమా బ్రేక్ చెయ్యాలి అని, చెబుతూనే…అలా ఉంటేనే, మన చిత్ర పరిశ్రమ పది కాలాల పాటు బావుంటుంది అని, అంతేకాకుండా ఆరోగ్యవంతమైన పోటీ ఉంటేనే మంచిది అని ఆయన తెలిపారు. ఇక ఈ మాటలు విన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిరు మాటలకు ఫిదా అయిపోయాడంటా…ఎందరో హీరోలు పరిశ్రమకు కారణం కావడానికి ఇన్స్పిరేషన్ అయిన చిరు అంతటి వారే ఆరోగ్యమైన పోటీ అందరిలో ఉన్నప్పుడే సినిమా పరిశ్రమ పది కాలాలపాటు పచ్చగా ఉంటుందని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం అని, నిజంగా మెగాస్టార్ ది మెగా మనసే అని ఎన్టీఆర్ చిరుపై పొగడ్తల వర్షం కురిపించినట్లు సమాచారం.