తమ సినిమా గురించి సినిమా హీరోలు ప్రచారం చేయడం చూసుంటారు. లేదంటే ఇతర హీరోల సినిమాల గురించి (అప్పుడప్పుడు) ప్రచారం చేయడం చూసుంటారు. అలా కాకుండా ఇతర హీరోల వ్యాపారాల గురించి స్టార్ హీరో ప్రచారం చేయడం చూశారా? అది కూడా పారితోషికం లేకుండా ఉచితంగా. అది కూడా మన దేశంలో కాకుండా విదేశాల్లో. మాకు తెలిసి ఇలాంటిది ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. అయితే తారక్ చేసేదానికి ముందు వరకు మాత్రమే.
‘దేవర’ సినిమాను ఇటీవల జపాన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తారక్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) జపాన్ వెళ్లి ప్రచారం చేశారు. ఈ క్రమంలో తారక్ నోట జపనీస్ ఫేవరెట్ ఫుడ్ సూసీ, కునాగ గురించి వచ్చింది. ఆ వెంటనే వాటిని మన దేశంలో బాగా వండి వడ్డించే హోటల్ పేరు కూడా వచ్చింది. ఆ హోటల్ పేరే ‘షోయు’. అవును నాగచైతన్య (Naga Chaitanya) క్లౌడ్ కిచెన్ షోయు గురించే అక్కడ తారక్ చెప్పింది, ఇప్పుడు మేం చెబుతున్నది కూడా.
‘దేవర’ (Devara) సినిమా ప్రచారంలో భాగంగా తారక్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు జపనీస్ ఫుడ్ అయిన సూషీ, కునాగ గురించి మాట్లాడాడు. అప్పుడు హైదరాబాద్‌లో ఇలాంటి ఫుడ్ దొరికే ఓ ప్లేస్ గురించి చెబుతాను అని తన ప్రియ స్నేహితుడు నాగచైతన్యకు చెందిన షోయు గురించి చెప్పుకొచ్చాడు. ది బెస్ట్ జపనీస్ ఫుడ్ మీకు అక్కడ దొరుకుతుంది అని చెప్పుకొచ్చాడు తారక్.
ఇదంతా చూసిన తారక్, నాగచైతన్య ఫ్యాన్స్ ‘ఇదే ప్రచారం బాబూ.. నువ్వు పీక్స్ అంతే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రచారం ఇప్పటివరకు ఎవరూ ఎక్కడా చూసి ఉండరు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మన దగ్గర కూడా ఆ హోటల్ ఏంటి అనే వెతుకులాట పెరిగే ఉంటుంది.