తెలంగాణలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్ వద్దకు తరలి వస్తూ పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలందరూ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పోలింగ్ బూత్ వద్దకు సెలబ్రిటీలు వస్తున్నటువంటి తరుణంలో
అక్కడికి మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చేరుకున్నారు ఇలా సెలబ్రిటీల అందరిని కూడా వారు క్యాప్చర్ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే ఓబుల్ రెడ్డి పాఠశాలలో జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి తల్లి శాలినితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ఈయన కూడా సాధారణ ప్రజల మాదిరిగా అక్కడ క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక ఈ ఓటు వేయడం కోసం లైన్లో నిలబడినటువంటి ఎన్టీఆర్ పక్కనే ఉన్నటువంటి మీడియా వారితోను అలాగే యూట్యూబ్ ఛానల్ వారితోనూ మాట్లాడుతూ మీరు ఓటు వేయరా ఇక్కడే ఉంటారా..?అంటూ ప్రశ్నించారు. దీనికి ఒక వ్యక్తి బదులిస్తూ.. మీరు ఓటు వేసిన తరువాత వేస్తాము. అయితే అంతా ఓటు వేయమని కేవలం సగం మంది మాత్రమే ఓటు వేస్తాము అంటూ ఆ వ్యక్తి సమాధానం చెప్పారు. దీంతో ఎన్టీఆర్ షాక్ అయ్యారు.
ఏంటి అంత ఓటు వేయరా సగం మంది మాత్రమే వేస్తారా అంటూ (Jr NTR) ఎన్టీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే సెలబ్రిటీలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ అందరికీ సూచిస్తున్నారు.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!