జపాన్ లో సతీసమేతంగా సందడి చేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ & రాజమౌళి.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీస్ తో కలిసి ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ చూసినా తారక్, చరణ్, రాజమౌళి గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్ లతో, చరణ్ వైఫ్ ఉపాసనతో కలిసి వెళ్లారు కానీ జక్కన్న మాత్రం సోలోగానే కనిపించారు.

ఇక అక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగినప్పటి నుండి స్టే చేసే హోటల్ మొదలుకుని జపాన్ ఫ్యాన్స్ రామ్, భీమ్ లను చూడ్డానికి ఎగబడ్డారు. వాళ్లతో కలిసి మాట్లాడడం, ఫొటోగ్రాఫ్స్, ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం.. వాళ్లపై తమకున్న అభిమానాన్ని వ్యక్త పరచడం.. అది చూసి తారక్, చరణ్ మంత్రముగ్దులవడం.. ఈ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ పిక్స్, వీడియోస్ రూపంలో వైరల్ అవుతున్నాయి. జనరల్ గా స్టార్స్, సినిమా షూటింగ్స్ కోసమో, లేదా షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని హాలీడే కోసమో విదేశాలకు వెళ్తుంటారు.

అలాంటిదిప్పుడు మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ లాంటి దేశాన్ని విజిట్ చెయ్యడంతో మన ట్రిపులార్ హీరోలు.. ప్రొఫెషన్ ప్లస్ పర్సనల్ అనుకుని ముందుగానే ఫ్యామిలీతో డిస్కస్ చేసినట్టున్నారు. అందుకే తారక్ ఫ్యామిలీతో, చరణ్, ఉపాసనతో వెళ్లారు. ప్రమోషన్స్ నుండి, ఫ్యాన్స్ మీట్ నుండి చిన్న బ్రేక్ తీసుకుని.. చెర్రీ, తారక్ టోక్యోలోని బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ని విజిట్ చేశారు. మంచి మంచి లొకేషన్లలో మెమరబుల్ పిక్స్ తీసుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్, ఉపాసన జంటలు తీసుకున్న పిక్స్ వారి ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చెయ్యడంతో నెట్టింట వైరల్ గా మారాయి.. రాజమౌళి కూడా కాస్త ఛేంజోవర్ కోసం అక్కడి కోజిమా స్టూడియోని సందర్శంచారు. వీడియో గేమ్ క్రియేటర్ కోజిమాను కలిసి దీపావళి గిఫ్ట్స్ ఇచ్చారు. ఆయనతో వీడయో గేమ్స్, మూవీస్ గురించి ముచ్చటించారు. సరాదాగా కాసేపు త్రీడీ ఫొటోషూట్ లో కూడా పాల్గొన్నారు. జక్కన్న త్రీడీ పిక్స్ ని కోజిమా షేర్ చెయ్యడంతో త్వరలో ఆయన వీడియో గేమ్ లో కనిపించనున్నారనే వార్తలు వస్తున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus